telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా కట్టడికి జ‌పాన్‌ అప్రమత్తం.. పలు ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ

corona japan

క‌రోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జ‌పాన్ ప్రభుత్వం మరింత అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనాను పూర్తిగా నియంత్రించేందుకు దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు టోక్యో, ఒసాకాతో పాటు మ‌రో ఐదు న‌గ‌రాల్లో ఎమ‌ర్జెన్సీని విధించింది. అయితే ఇప్ప‌టికే మాల్స్‌, సినిమా థియేట‌ర్లు, బార్లు, ప‌బ్బులు మూసివేశారు.

కాగా బ్యాంకులు, సూప‌ర్ మార్కెట్‌లు ఓపెన్ చేసి ఉంటాయ‌ని అక్క‌డి ప్ర‌భుత్వం తెలిపింది. ఈ ఎమ‌ర్జెన్సీ నెల‌రోజుల పాటు ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. ప్ర‌జ‌లంతా ఇళ్ల‌ల్లోనే ఉంటూ సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని జపాన్ ప్ర‌ధాని షింజో అబే పిలుపునిచ్చారు. ఇప్ప‌టికి జ‌పాన్‌లో 4వేల‌కు కోవిడ్ కేసులు ఉండ‌గా 92 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Related posts