ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసమే తాను విదేశీ పర్యటనలు చేపట్టానని ఏపీ అన్నారు. ప్రధాని మోదీ కూడా అనేక దేశాల్లో పర్యటించారని చెప్పారు.
వైసీపీ కూడా పెట్టుబడులను తీసుకొచ్చేందుకు యత్నించాలని హితవు పలికారు. వృథా ఖర్చు అని విమర్శించడం సరికాదని అన్నారు. తనపై విమర్శలు చేయడం మానుకొని, మీ వెనుక ఉన్నవి చూసుకోవాలని చెప్పారు. ప్రతి దానికి తనపై విచారణ జరిపించాలని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలిపామని చెప్పారు.
పవన్ కళ్యాణ్ పై లక్ష్మీ పార్వతి ఫైర్