రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “మన్మథుడు-2”. ఈ చిత్రంలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమాలో హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్‌లో కూడా లిప్‌లాక్ సన్నివేశాలను చూపించారు. ఈ సినిమాకు తాజాగా సెన్సార్ కంప్లీటైంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ సినిమాలో ‘మన్మథుడు’లో హిల్లేరియస్ కామెడీతో తెరకెక్కించినట్టు ఈ సినిమా ప్రోమోస్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోతో పాటు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి మోడ్రన్ మన్మథుడిగా నాగార్జున మరోసారి మాయ చేసేలా కనిపిస్తున్నాడు. ఇప్పుడు “మన్మథుడు-2″తో మరోసారి నాగార్జున ప్రేక్షకులను మాయ చేస్తాడేమో చూడాలి.
previous post
మీవల్లే కళ్యాణ్ గారిని కలిశాను… నా జీవితంలో మీరు చాలా స్పెషల్…