telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టీవీ నటుడిపై దాడి… తీవ్ర గాయాలు

Ansh Bagri

హిందీ నటుడు అన్ష్ బగ్రీ ఢిల్లీలోని పశ్చిమ విహార్‌లో నివసిస్తున్నాడు. ఆయన హిందీ టీవీ సీరియల్స్‌తో పాటు, పలు షోలలో కూడా నటిస్తుంటాడు. కొద్ది రోజుల క్రితం అన్ష్ పై 10 మంది దుండగులు విచక్షణ రహితంగా దాడికి దిగారు. ఈ దాడిలో అన్ష్‌ తలకు తీవ్రగాయాలు కావడంతో అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడి వెనుక ఓ కాంట్రాక్టర్ హస్తం ఉన్నట్లు తేలింది. అన్ష్ తన ఇంటిని నిర్మించేందుకు ఓ కాంట్రాక్టర్‌ను మాట్లాడుకున్నాడు. అయితే నిర్మాణ సమయంలో అన్ష్‌తో అతనికి వివాదం తలెత్తింది. దీంతో ఆ కాంట్రాక్టర్‌ వెళ్లిపోయాడు. అయితే అతడే ఆ కోపంతో అన్ష్‌పై దాడి చేసేందుకు కొంతమందిని పంపించాడు. శనివారం అన్ష్ ఇంటికి చేరుకున్న ఆ దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు గురించి ఆరా తీస్తున్నారు. నటుడిపై దాడి అనే విషయం ఇప్పుడు సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related posts