telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో హాట్‌టాపిక్‌గా స్థానిక సంస్థల ఎన్నికలు …

Nimmagadda ramesh

స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఏపీలో మరింత హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఎన్నికలు ప్రభుత్వం వద్దంది..! ఉద్యోగులు మా వల్ల కాదన్నారు. అయినప్పటికీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలచేసిన ఏపీ ఎన్నికల  సంఘానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు దశల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ ఎస్‌ఈసీ విడుదల చేసిన షెడ్యూల్‌ను కోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది.  పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సర్కార్‌.. కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్న సమయంలో నిర్వహణ అసాధ్యమని ధర్మాసనం ముందు వాదనలు వినిపించింది. రెండు పక్షాల వాదనలు విన్న కోర్టు… ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేసింది. ఎస్‌ఈసీ నిర్ణయం ఆర్టికల్స్‌ 14, 21ని ఉల్లంఘించే విధంగా ఉందని తెలిపింది. మరోవైపు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును.. డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది ఎస్‌ఈసీ. ఇది సుప్రీం కోర్టు నిబంధనలుకు విరుద్ధంగా ఉందని హౌస్‌ మోషన్‌ పిటిషన్‌లో పేర్కొంది. వరుస సెలవులు ఉన్నందున.. అత్యవసర పిటిషన్‌గా భావించి విచారణ జరపాలని కోరింది. దీనిని అంగీకరించిన న్యాయస్థానం ఇవాళ ఉదయం విచారణ చేపట్టబోతోంది.  మొత్తానికి కోర్టు నిర్ణయంతో ఇప్పట్లో ఎన్నికలు ఉండే ఛాన్స్ లేదు అని అంతా భావిస్తున్నా… ఎస్‌ఈసీ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌తో ఏం జరుగుతుంది ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts