telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలుసా…?

ఈ రోజు దీపావళి. ఈ రోజున చీకటి పడగానే టపాసుల మోతలు వినిపిస్తుంటాయి.  దీపావళి అంటే టపాసులు కాల్చడం అని అందరూ అనుకుంటూ ఉంటారు.  దీపావళి అంటే టపాసులు కాల్చడం కాదు.  దీపాలతో ఇంటిని అలంకరించడం అని అర్ధం.  మట్టి ప్రమిదల్లో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు.  దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరస అని అర్ధం.  మొత్తంగా దీపావళి అంటే దీపాల వరస అని అర్ధం.  ఇంట్లో మట్టిప్రమిదల్లో దీపాలు వెలిగించి లక్ష్మిదేవికి పూజలు చేస్తారు. ఎవరింటి ముందు దీపాలు వెలుగుతాయో వారి ఇంట్లోకి లక్ష్మదేవి వస్తుందని అంటారు. దీపావళి వేడుకను జరుపుకోవడం వెనుక చాలా పెద్ద కథ ఉంది.  విష్ణుమూర్తి, భూదేవి కుమారుడైన భౌముడు ప్రాగ్జోతిషపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగిస్తుండేవాడు.  భౌముడి పరిపాలన క్రూరంగా, నరకప్రాయంగా మారడంతో భౌముడికి నరకాసురుడు అనే పేరు వచ్చింది.  నరకాసురుడిని శ్రీకృష్ణుడు వధిస్తాడు.  నరకాసురుడు చెర నుంచి ప్రజలు విముక్తి పొందడంతో, దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటారు.  అప్పటి నుంచి ప్రతిఏడాది ఆశ్వీయుజమాసంలోని నరక చతుర్థి రోజున దీపావళి పండగ జరుపుకుంటారు.  

Related posts