telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరినీ చదివించండి ..ఫీజు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుంది

*పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి విద్య
*విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి విద్యాదీవెన డబ్బు జమ
*పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువే

బాపట్లలోని జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధులను గురువారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.మూడో విడత విద్యా దీవెన కింద రూ.694 కోట్ల నిధులను సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. సుమారు 11.02 లక్షల మంది విద్యార్ధులకు విద్యా దీవెన కింద లబ్ది చేకూరనుంది.

ఈ సంద‌ర్భంగా  సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ..పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి చదువు. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వాన్నే భరిస్తుంద‌ని అన్నారు.

అందులో భాగంగానే ప్రతి విద్యార్థికి 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మూడో విడత జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నామ‌ని తెలిపారు .

పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువే. ప్రపంచంతో పోటీ పడే విధంగా పిల్లలకు శిక్షణ అందిస్తున్నామ‌న్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే నా ఆకాంక్ష. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చాం.

కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరినీ చదివించండి. పెద్ద చదువులు పేదలకు హక్కు. ప్రతి ఇంటినుంచి ఇంజినీర్లు, డాక్టర్లు, ఐపీఎస్‌లు రావాలి. మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది అని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. అయితే మా పథకాలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

అలాంటప్పుడు ఈ పథకాలను గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? గత పాలనలో రాష్ట్రంలో కేవలం ఆ నలుగురే బాగుపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వారికి కడుపుమంటగా ఉంటోంది’ అని జగన్‌ మండిపడ్డారు. 

 

Related posts