*హైదరాబాద్‌లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
*ఎర్రగడ్డ రైతు బజార్ నుంచి మొదలైన బైక్ ర్యాలీ
*సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ
‘‘హర్ ఘర్ తిరంగ్’’ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బైక్ ర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం నగరంలోని ఎర్రగడ్డ రైతు బజార్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది.జాతీయ జెండాలతో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పలువురు బీజేపీ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.
ఎస్సార్ నగర్, పంజాగుట్ట, కేర్ హాస్పిటల్, సచివాలయం, లిబర్టీ, హిమాయత్ నగర్, శంకర్ మట్, అడిక్మెట్, మాణికేశ్వర్ నగర్, ఇఫ్లూ, చిలకలగూడ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ర్యాలీ ముగియనుంది.