ఆస్పత్రిలో కరోనా చికిత్సకు పరికరాలు ఇవ్వడం లేదని ఆరోపణలు చేసి ఇటీవల సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ఎనస్థిషియన్ డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖపట్నం పోలీసులు శనివారం దారుణంగా వ్యవహరించిన విషయం విదితమే. నిన్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు
అయితే తాజాగా ఆయనపై ఐపీసీ సెక్షన్ 353, 427 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను మెంటల్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ సుధాకర్ మానసిక స్థితి బాగోలేదని, మెంటల్ ఆస్పత్రికి తరలించాలని కేజిహెచ్ సూపరింటెండెంట్ అర్జున రిఫర్ చేశారు.