telugu navyamedia
రాజకీయ

ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ ప్రమాణ స్వీకారం

*భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం..
*జగ్‌దీప్ ధన్‌ఖడ్ తో ప్ర‌మాణం చేయించిన‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఉప రాష్ర్ట‌ప‌తిగా భారత దేశ 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు . ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సుబ్రహ్మణ్యం జైశంకర్ తదితరులు హాజరయ్యారు.

భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగిసిన విషయం తెలిసిందే. అనంతరం తదుపరి ఉపరాష్ట్రపతి బాధ్యతలను జగ్‌దీప్ ధన్‌ఖడ్ తీసుకున్నారు.

కాగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ వృత్తి రీత్యా లాయర్‌. రాజకీయాల్లోకి వచ్చినా సుప్రీంకోర్టు లాయర్‌గా పని చేస్తూనే వచ్చారు. ఎంపీ నుంచి గవర్నర్‌గా, అక్కడి నుంచి తాజాగా ఉపరాష్ట్రపతి దాకా జనతాదళ్, కాంగ్రెస్‌ల మీదుగా బీజేపీ దాకా ఆయనది ఆసక్తికర ప్రస్థానం.

రాజస్థాన్‌ హైకోర్టులో లాయర్‌గా పచేసిన ధన్‌కర్‌.. మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్‌ చొరవతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990లో చంద్రశేఖర్‌ మంత్రివర్గంలో కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు. 1991లో పీవీ నర్సింహారావు హయంలోనూ మంత్రిగా సేవలు అందించారు

Related posts