telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అడవులను పెంచడమే హరితహారం లక్ష్యం: కేటీఆర్

KTR TRS Telangana

రాష్ట్రంలోని అడవులను 33 శాతానికి పెంచడమే హరితహారం లక్ష్యమని లంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హరితహారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్ట గ్రామంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తో కలిసి కేటీఆర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…10 శాతం బడ్జెట్ ను హరితహారం కార్యక్రమానికి కేటాయించిన ఏకైక సీఎం కేసీఆర్ అని కితాబునిచ్చారు.

ఇప్పటి వరకు 180 కోట్లకు పైగా మొక్కలను నాటామని చెప్పారు. ఈ కార్యక్రమం వల్ల ఎలాంటి రాజకీయ లాభం ఉండదని, భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని అన్నారు. చెట్లను కాపాడుకోలేకపోతే రాబోయే రోజుల్లో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గ్రామాల్లో నాటిన మొక్కల్లో 85 శాతం బతకకపోతే గ్రామ సర్పంచ్ పదవి పోయేలా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

Related posts