రెండు రోజుల సార్వత్రిక సమ్మె లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో ఆటోలు, క్యాబులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగ రీత్యా ఉదయంపూట పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు బస్సుల కోసం పడిగాపులు పడాల్సి వచ్చింది. క్యాబ్ లు నడవక పోవడంతో విమానాశ్రయానికి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 2018 ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా సమ్మెకు పలు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 48 గంటల పాటు సమ్మె జరగనుండగా, తెలంగాణ మజ్దూర్ యూనియన్ న్యూ డెమోక్రసీ, టీ.మాస్ ఫోరమ్ కూడా సమ్మెకు సంపూర్ణ మద్దతు పలికాయి.
జగన్ అందుకే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు: ఎమ్మెల్సీ బుద్ధా