telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆ విషయంలో అడ్డంగా బుక్కయిన మరో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…!

మొన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, నిన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావ్, నేడు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు. ఒకరి తర్వాత మరొకరు సహనం కోల్పోయారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులను అసభ్య పదజాలంతో విరుచుకుపడితే, మరొకరు ఒక జర్నలిస్ట్ ను బండ బూతులు తిట్టారు . గాజులరామారంలో నిరుపేదల ఇండ్లు కూల్చారంటూ సంబంధిత వీఆర్వో ను ఎమ్మెల్యే వివేక్ దూషించడం సంచలనం రేపింది . ఈ ఘటన కాస్తా వివాదాస్పదమై…ఎమ్మెల్యే పై వీఆర్వో పోలీస్ ఫిర్యాదు చేసే వరకెళ్లింది. ఇక ఇటీవల మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పలు కాలనీలను వరదలు ముంచేయగా….వరదలపై ఒక జర్నలిస్ట్ అనవసర రాద్ధాంతం చేశాడంటూ…ఎమ్మెల్యే మైనంపల్లి విలేఖరిపై తీవ్ర స్థాయిలో తిట్ల దండకానికి దిగడం చర్చనీయాంశమైంది. తాజాగా , ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు…ఒక గ్రామ సర్పంచ్ , కారోబారి తో సహా ట్రాక్టర్ డ్రైవర్ లపై తిట్ల దండకానికి పూనుకోవడంతో గ్రామస్తులు నిస్చేస్టులయ్యారు. సదరు ఉద్యోగులు, సర్పంచును వివరణ ఇచ్చేందుకు సైతం అవకాశమివ్వకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా తిట్ల వర్షం కురిపించడంతో స్థానికులు అవాక్కయ్యారు.

Related posts