telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరు 153 సినిమాకు ముహూర్తం ఖరారు ?

chiru

కొరటాల శివ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమానుంచి మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలై విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అందాల చందమామ కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈనెల 9వ తేదీ నుంచి ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. 9 నుంచి షూటింగ్‌కు హాజరై లాంగ్ షెడ్యూల్‌లో షూటింగ్‌ను పూర్తి చేయబోతున్నారు. డిసెంబర్ చివరికల్లా ‘ఆచార్య’ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి అయిన వెంటనే చిరంజీవి తన తర్వాతి సినిమాను మొదలు పెట్టబోతున్నారట. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ రీమేక్‌కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెహర్ రమేష్ దీనికి దర్శకుడు. ఈ సినిమాలో హీరో చెల్లి పాత్రకు కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయమై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఈ సినిమాను జనవరి 18న ప్రారంభించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్. సంక్రాంతి తర్వాత సిద్ధంగా ఉండాలని ఇప్పటికే మెహర్ రమేష్‌కు చిరు చెప్పారని తెలుస్తోంది.

Related posts