telugu navyamedia
రాజకీయ వార్తలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..సివిల్ సర్వీసెస్ లో సంస్కరణలు!

praksh javadekar

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగ నియామక సంస్కరణల కోసం తీసుకువచ్చిన ‘మిషన్ కర్మయోగి’ కార్యాచరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఈ అంశం గురించి మీడియాకు తెలియ‌జేశారు. సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రధానమంత్రి పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్ నిర్వహించనున్నారు.

జమ్మూ కశ్మీర్ లో 5 అధికార భాషలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కశ్మీరీ, ఉర్దూ, డోగ్రీ, హిందీ, ఇంగ్లీషు గుర్తింపు పొందనున్నాయి. వీటికి సంబంధించి పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 3 కీలక ఎంవోయూలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

Related posts