అమేథీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ప్రియాంకగాంధీ అనుసరించిన తీరుపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం ఆమె నానా పాట్లు పడుతున్నారని అన్నారు. అమేథీలో నమాజ్ చేశారని గుర్తు చేశారు.
ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని ఉజ్జైనీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారని అన్నారు. ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ అమలు చేయలేదని స్మృతి విమర్శించారు. తన వద్ద మంత్రదండం లేదని రాహులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.