telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీహార్‌ : ఇవాళే చివరి దశ పోలింగ్…78 స్థానాలలో ఓటింగ్

62.6 percent polling in 3rd phase

బీహార్‌లో ఇవాళ చివరి దశ పోలింగ్‌ జరుగనుంది. దీంతో ఈరోజు అన్ని పార్టీలకు కీలక కానుంది. 15 జిల్లాలలోని 78 సీట్లకు ఈ రోజు పోలింగ్‌ జరగనుంది. ఇవాళ జరిగే మూడో దశ ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలు ప్రచార హోరుతో తమ శక్తియుక్తులు చూపించాయి. ఈ రోజు పోలింగ్‌ జరిగే 78 స్థానాల్లో 63 జనరల్‌ కాగా..13 రిజర్వ్‌డ్‌ సీట్లు. మూడో దశ ఎన్నికల్లో మొత్తం 1204 మంది తమ భవిష్యత్‌ తేల్చుకోనున్నారు. ఈ 78 సీట్లలో 2015లో జేడీయూ 23 స్థానాలను గెలుచుకోగా..ఆర్జేడీ 20 సీట్లు, బీజేపీ 20 సీట్ల చొప్పున గెలుచుకున్నాయి. కాంగ్రెస్‌ 11 స్థానాలు దక్కించుకుంది. 2015 ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీచేశాయి. ఈ సారి ఎన్నికల్లో సీఎం నితీష్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో పాటు చిరాగ్‌ పాశ్వాన్‌లతో పోటీ ఎదురుకానుంది. ఫలితంగా 2015 కన్నా ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో నితీష్‌కు గట్టపోటీ ఉండనుంది. కాగా..బీహార్‌ లో ఇప్పటికే రెండు విడుతల పోలింగ్‌ ప్రశాంతంగా పూర్తయింది.

Related posts