నటి, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి…త్వరలోనే బీజేపీలో చేరనున్నారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం…ఆమె కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం..దుబ్బాకలో ఉద్రిక్తతల నడుమ ఉప ఎన్నికల ప్రచార పర్వం కొనసాగుతున్నా..అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం. అంతేకాదు..ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏకంగా విజయశాంతి ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. ఈ భేటీ సుమారు ఆరగంట పాటు సాగింది. ఇదిలా ఉండగా, మరోవైపు బీజేపీ ముఖ్య నాయకులు విజయశాంతిపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఆమె చరిష్మా ఉన్న గొప్ప నాయకురాలని, తెలంగాణకోసం కష్టపడి పనిచేసినప్పటికీ…సీఎం కెసిఆర్ ఆమెను మోసంచేశారని అన్నారు . కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతిని బీజేపీ ముఖ్యనాయకుడు బహిరంగ వేదికల్లోనే పొగడడాన్ని గమనిస్తే ఆమె బీజేపీలో చేరికపై పార్టీ అధిష్టానం పరోక్షంగా స్పష్టమైన సంకేతాలిచ్చినట్లైంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ విజయశాంతి పార్టీ మారదని..తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. బీజేపీ లాంటి మతతత్వ పార్టీలోకి విజయశాంతి వెళ్లదని..ఆమెతో ఎన్నోసార్లు మాట్లాడానని తెలిపారు. అయితే…మాధుయాష్కీ వ్యాఖ్యలపై స్వయంగా విజయశాంతి స్పందించారు. “రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరు నాయకులు చానెల్స్‌లో లీకేజిల ద్వారా నాపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయిస్తున్నారు. వాస్తవాలను మాట్లాడిన మధుయాష్కీగారికి నా ధన్యవాదాలు. ” అంటూ విజయశాంతి పేర్కొన్నారు. అయితే..విజయశాంతి స్పందన బట్టి చూస్తే…తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేసినట్లు కన్పిస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాల్సిందే.
previous post
next post