telugu navyamedia
క్రీడలు వార్తలు

నేషనల్ డ్యూటీ నుండి ఫాదర్ డ్యూటీకి వచ్చేసిన పాండ్యా…

దాదాపు 5 నెలలు తర్వాత తిరిగి వచ్చి తన కుటుంబాన్ని కలుకున్నాడు భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. అయితే ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈకి వెళ్లిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత అక్కడి నుండే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళాడు. అయితే ఈ పర్యటనలో కేవలం పరిమిత ఓవర్ల సిరీస్ కు మాత్రమే ఎంపికైన హార్దిక్ తాజాగా భారత్ కు తిరిగి వచ్చాడు. అయితే పాండ్యా వచ్చి రాగానే తన కొత్త భాధ్యతలు మొదలుపెట్టాడు. తన కుమారుడు అగస్త్యను అడిస్తున్నాడు. అయితే అగస్థ్యకు పాలు తాగిస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాండ్యా దానికి ”నేషనల్ డ్యూటీ నుండి ఫాదర్ డ్యూటీకి” అని క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే పాండ్యా అగస్థ్యను ఆడిస్తున్న వీడియోను అతని భార్య నటాషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఆసీస్ లో పాండ్యా ఆడిన రెండు సిరీస్ లలో చెలరేగిపోయాడు. కానీ అతను చేసిన పోరాటం వన్డేలో వృధా అయిన టీ 20 సిరీస్ లో మాత్రం జట్టుకు సిరీస్ ను అందించింది. అయితే హార్దిక్ పూర్తిగా ఫిట్ గా లేకపోవడంతో ఈ సిరీస్ లో అతను అంతగా బౌలింగ్ చేయలేదు. కానీ బ్యాట్ తో మాత్రం అద్భుతంగా రాణించాడు.

Related posts