హైదరాబాద్‌లోనడిరోడ్డుపై అలేఖ్య అనే సాఫ్ట్‌వేర్ అమ్మాయిని ఓ కారు ఢీ కొట్టి ఆమెను 50 అడుగుల వరకు ఈడ్చుకెళ్లింది. ఎస్సార్‌నగర్ చోటు చేసుకున్నఏదే దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించి నిందితురాలిని గుర్తించారు.
అలేఖ్యను ఢీ కొట్టిన కారును ప్రణీత అనే మహిళ నడుపుతున్నట్లు తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అలేఖ్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఓ ఆసుపత్రికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు సరిగ్గా స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.