ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో శాంతిభద్రతలు అట్టడుగు స్థాయికి చేరాయని పేర్కొంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రెండు పేజీల లేఖ రాశారు. వాక్ స్వాత్రంత్యం హరిస్తున్నారని, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని లేఖలో ఆరోపించారు.
ప్రజలు, మీడియా ప్రతినిధులపై వరుస దాడులు జరుగుతున్నాయని, సంఘ విద్రోహశక్తుల ద్వారా శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని, చీరాలలో విలేకరిపై ఆమంచి వర్గీయులు దాడి చేసినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గతంలో ఏపీ పోలీసులకు ‘సమర్థులు’ అనే పేరు ఉండేదని, కొన్నాళ్లుగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే పేరు వచ్చిందని ఆరోపించారు. ఏపీలో ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించాలని తన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
రామ్గోపాల్ వర్మ సైకో డైరెక్టర్: యామిని