telugu navyamedia
రాజకీయ

వెన‌క్కి త‌గ్గిన ఆఫ్ఘన్ తాలిబన్లు..?

తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘనిస్తాన్‌లో కల్లోలం కొనసాగుతూనే ఉంది. తాలిబ‌న్లు ఆక్ర‌మించుకోవ‌డంతో అరాచ‌క‌పాల‌న మొద‌లౌతుంద‌ని, అనేక ప్రాంతాల్లో అప్ప‌టికే ఆ త‌ర‌హా పాల‌న మొద‌లైంద‌ని ప్ర‌జ‌లు భ‌య‌ప‌డ్డారు. నెల రోజుల క్రితం నుంచి తాలిబన్లు ప్ర‌భుత్వ‌ కార్యాల‌యాలు, పాఠ‌శాల‌లు త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఇలాంటి తరుణంలో తాలిబన్లు సాధారణ క్షమాభిక్ష ప్రకటించటం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.  అఫ్ఘానిస్థాన్ ను ఆక్రమించిన తాలిబన్ల పాలన ఎంత ఆటవికంగా ఉండబోతుందో అని ప్రపంచ దేశాలు నివ్వేరపోతుంటే.. తాలిబన్లు అందరికి షాక్ ఇస్తూ… శాంతి పంతాని ఎంచుకున్తున్నట్టు ప్రకటించారు. ప్ర‌భుత్వంలో ప‌నిచేసిన అధికారుల‌కు క్ష‌మాభిక్ష ప్ర‌క‌టించారు.

Afghanistan: Taliban announces 'amnesty', urges women to join government | Business Standard News

దీనికి కారణం అంతర్జాతీయ సమాజం నుండి వ్యతిరేఖత అధికమవటంతో తాలిబన్లకు వారు వెనక్కి తగ్గారు అనే చెప్పాలి. “ప్రభుత్వ ఉద్యోగులందరూ విధుల్లోకి రావాలని, మహిళలు వారి ప్రభుత్వ పాలనలో భాగాస్వాములవ్వని.. దేశ ప్రజలందరికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు” తాలిబన్లు ప్రభుత్వం మంగళవారం కీలక ప్రకటన  చేసింది. అంతేకాకుండా, “ప్రజలందరూ ఎలాంటి భయాందోళనకు గురవకుండా రోజు వారి కార్యక్రమాలను ప్రారంభించుకోవచ్చు” అని తాలిబన్లు ప్రకటించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో తిరిగి ఆ దేశంలో శాంతి నెల‌కొనే అవ‌కాశ ఉంటుంది.

ఇదిలావుంటే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తోపాటు పలు సామాజిక మాద్యమాలు ముందుగా రియాక్ట్అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ అంతటా తాలిబాన్ల ఆక్రమణ మధ్య సామాజిక సంస్థ ఫేస్‌బుక్ ఈ సంస్థకు పెద్ద దెబ్బ కొట్టింది. ఫేస్‌బుక్ తన ప్లాట్‌ఫాం నుంచి తాలిబాన్‌లను పూర్తిగా నిషేధించింది. అమెరికా చట్టం ప్రకారం తాలిబాన్ ఒక ఉగ్రవాద సంస్థ అని ఫేస్ బుక్ ఒక ప్రకటన విడుదల చేసింది. కాబట్టి తాలిబాన్ కోసం ఫేస్బుక్ సేవను నిషేధించింది.

Related posts