telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్మకాలు: మంత్రి నారాయణస్వామి

Narayana swamy Minister

రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం మద్యం షాపులను తగ్గించామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వెల్లడించారు. నేటి నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు. మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయని, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్మకాలు జరుగుతాయని వివరించారు.

బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతామని, నాటుసారా అమ్మితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మున్ముందు మద్యపాన నిషేధంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎమ్మార్పీ రేట్లకే మద్యం అమ్ముతామని చెప్పారు. అయితే, రాష్ట్రంలో బార్ల విషయంలో మరో 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Related posts