telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనాపై అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ

karona effect

భారత్‌లో కోవిడ్-19 (కరోనా) అనుమానిత కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. దేశంలోని అన్నీ విమానాశ్రయాల్లో కరోనా స్క్రీనింగ్‌ కేంద్రాల ఏర్పాటు తప్పనిసరి చేయాలని సూచించింది. చైనా, సింగపూర్, మలేషియా, ఇండొనేషియాతో పాటు పలు దేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, ప్రయాణికుల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించింది. కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు వైరస్‌ బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా ఆసుపత్రుల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Related posts