telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

చెట్టు నరికారాని ఫైన్.. ఎంతంటే…?

తెలంగాణ ప్రభుత్వం.. హరితహారం పేరుతో చెట్లను నాటడం పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.. అయితే, అక్కడక్కడ చెట్లను నరికివేయడాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు అధికారులు.. హైదరాబాద్‌లో చెట్టును నరికిన ఓ వ్యక్తికి.. ఏకంగా రూ.62 వేలకు పైగా జరిమానా విధించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సైదాబాద్ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అడ్డువస్తోందని స్థానికులు ఓ భారీ వేపచెట్టును కొట్టేశారు. సుమారు నలభై ఏళ్ల వయస్సు ఉండే వేప చెట్టును రాత్రికి రాత్రి కొట్టేయటంతో పాటు, ఆనవాళ్లు కనిపించకుండా కలపను తరలించారు.. ఇక, చెట్టు ఆనవాళ్లను తగులబెట్టే ప్రయత్నం కూడా చేశారు. అయితే, ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ ఎనిమిదవ తరగతి విద్యార్థి… అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.. అటవీశాఖ టోల్ ఫ్రీ నంబర్ (1800 425 5364) కు ఫోన్ చేసిన ఓ విద్యార్థి.. తమ ఇంటి సమీపంలో జరగిన ఈ ఘటనను వారి దృష్టికి తీసుకెళ్లాడు.. దీంతో, విచారణ చేపట్టిన అటవీ శాఖ ఈస్ట్ అధికారులు.. అనుమతి లేకుండా చెట్టును నరికివేశారని నిర్ధారించారు.. బాధ్యులను గుర్తించి వారికి రూ.62, 075 జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని వసూలు చేశారు.

Related posts