telugu navyamedia
వార్తలు

మధ్యప్రదేశ్‌లో వింత ఆచారం ..

మధ్యప్రదేశ్‌లో అనాగరిక ఘటన చోటు చేసుకుంది. టెక్నాల‌జీ పెరుగుతున్న కొద్దీ ముఢనమ్మకాలు ఎక్కువుతున్నాయి. వర్షాలు కురిపించాలని వాన దేవుడిని ప్రార్థిస్తూ బాలికలను నగ్నంగా వీధుల్లో తిప్పారు.  దమోహ్‌ జిల్లాలోని బనియా గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారింది.

వింత‌ ఆచారం..
కరవు పరిస్థితులు ఉన్నప్పుడు వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్ర‌తి ఏటా ఆ గ్రామంలో బాలికలను నగ్నంగా మార్చి.. వారితో బరువైన రోలు మోయించి.. వీధుల్లో తిప్పుతూ మహిళలు భజనలు చేసి, ఇలా సేకరించిన ఆహార పదార్థాలతో గ్రామ దేవాలయం ఎదుట అన్నదానం చేసి.. పూజలు చేస్తే వర్షం కురుస్తుందని ఆ గ్రామస్థుల మూఢ  ఆచారం ఉంది. 

ఆచారంలో భాగంగా ఆరుగురు బాలికలను నగ్నంగా తిప్పిన క్రమంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ ఘటన కంప్యూటర్‌ యుగంలోనూ కొనసాగుతున్న మూఢాచారాలకు అద్దం పడుతోంది.

Superstition: వర్షం కోసం దారుణం.. బాలికలను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు.. ఎక్కడంటే..?

 

 

 

Related posts