విడుదలైన రెండు రోజుల్లో వంద కోట్ల క్లబ్ లో చేరిన సినిమా ఆయుష్మాన్ ఖురానా నటించిన హిందీ చిత్రం ‘డ్రీమ్ గర్ల్’ . ఈ రొమాంటిక్ కామెడీ సినిమా తెలుగు అనువాద హక్కుల్ని 2019 చివరిలోనే ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు సొంతం చేసుకున్నారు. రాజ్ తరుణ్ హీరోగా అనీశ్ కృష్ణ దర్శకత్వంలో దానిని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. అయితే… ఈలోగా కరోనా రావడం, లాక్ డౌన్ ఏర్పడటంతో ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. ఇదే సమయంలో అనీష్ కృష్ణ… నాగశౌర్య సొంత బ్యానర్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే… తాజాగా ‘డ్రీమ్ గర్ల్’ ప్రాజెక్ట్ దర్శకుడు కొండా విజయ్ కుమార్ చేతిలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజ్ తరుణ్ – కొండ విజయ్ కుమార్ కాంబినేషన్ లో ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా విడుదలై మంచి గుర్తింపే ఇద్దరికీ తెచ్చిపెట్టింది. ఆ సినిమా విడుదలకు ముందే వీరిద్దరి కాంబినేషన్ లో ‘పవర్ ప్లే’ అయే థ్రిల్లర్ మూవీ మొదలైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ‘పవర్ ప్లే’ మూవీ మార్చి 5న విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత ముచ్చటగా మూడో చిత్రంగా వీరిద్దరి కాంబినేషన్ లో ‘డ్రీమ్ గర్ల్’ తెలుగు రీమేక్ సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తోంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట!
previous post
next post