telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆజంఖాన్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే.. మాయావ‌తి డిమాండ్ 

Mayawati Welcomes Reservation To Upper Castes

లోక్‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ర‌మాదేవిపై  ఎస్పీ ఎంపీ ఆజంఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్య‌లను పార్టీలకు అతీతంగా అందరు ఖండించారు.  మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే అని బీఎస్పీ నేత మాయావ‌తి అన్నారు. ఈరోజు  ఆమె మీడియాతో మాట్లాడారు. మ‌హిళ‌ల హుందాత‌నానికి ఆజం ప్ర‌క‌ట‌న వ్య‌తిరేకంగా ఉంద‌న్నారు. 

ఆజం వ్యాఖ్య‌లు వేధిస్తున్నాయ‌ని మాయావ‌తి అన్నారు. ఎంపీ ఆజం వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నామ‌ని ఆమె అన్నారు. లోక్‌సభ ప్రిసైడింగ్ లేడీపై ఈ తరహా భాషను అజంఖాన్ వాడటం నేరం. మహిళల గౌరవం, హోదాకు భంగకరం. ఆయన వ్యవహరించిన తీరు గర్హనీయం. కేవలం పార్లమెంటుకే కాదు, మహిళలందరికీ అజంఖాన్ క్షమాపణలు చెప్పాలి’ అని మాయావతి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
కాగా, రమాదేవి చాలా గౌరవనీయురాలని, తనకు సోదరి లాంటిదని అజంఖాన్ చెప్పారు. తాను క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదని, తాను ఎలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయలేదని, అలా చేసి ఉంటే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమేనని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ కూడా అజంఖాన్‌ను సమర్ధించారు. 

Related posts