telugu navyamedia
రాజకీయ

దేశంలో మ‌ళ్ళీ పెరిగిన క‌రోనా కేసులు. .

భార‌త దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. క‌రోనా సెకండ్‌వేవ్ క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. మ‌ళ్ళీ కొత్త కేసులు పెరుగుతున్నాయి.

గత 24 గంటల్లో 13,01,083 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,987 మందికి పాజిటివ్‌గా అని తేలింది. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో 16 శాతం పెరుగుదల కనిపించింది.

తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 19,808 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకొన్నారు. బుధవారం 13,01,083 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 18 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి..246 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం రికవరీ రేటు 98.07 శాతానికి చేరింది.

ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా 2.06 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 35.66 లక్షల మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటి వరకు పంపిణీ అయిన వ్యాక్సిన్ల సంఖ్య 96.82 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

Related posts