telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అందుకే ఈటల బర్తరఫ్..గంగుల సంచలన వ్యాఖ్యలు

ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు టీఆర్ఎస్ ను వీడి.. అడ్రసు లేకుండా పోయారని మరికొందరి వాదన. ఈ నేపథ్యంలో ఈటలపై మరోసారి మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో 15 రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ఈటెల రాజేందర్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు ఫిర్యాదులు చేశారని..వెంటనే ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడం ఈటెలను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. హుజురాబాద్ నాయకులను ప్రజా ప్రతినిధులను డబ్బులిచ్చి కొంటున్నారు అంటూ ఈటల అనడం బాధాకరమని..టిఆర్ ఎస్ పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అమ్ముడుపోయారు అనడం బాధ కలిగిందన్నారు. టిఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన వారు ఎవ్వరు అమ్మడు పోరని.. గంగులకు వర్గం ఉండదు అందరూ టిఆర్ఎస్ వర్గం వాళ్లేనని ఈటలకు చురకలు అంటించారు. ఈటల కాంగ్రెస్, బిజెపి వాళ్ళ గడప తొక్కడంతో అక్కడి టిఆర్ఎస్ నేతలు అయోమయంలో పడ్డారని.. తర్వాత వారంతా ఈటలను వదిలి టిఆర్ఎస్ లోనే ఉంటామని చెప్పారని పేర్కొన్నారు. కేసీఆర్ బొమ్మ చూసి ఓట్లు పడ్డాయి కావున తాము టీఆర్ఎస్ వెంటే ఉంటామని వస్తున్నారని గంగుల తెలిపారు.

Related posts