telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

దబంగ్ 3.. ఫస్ట్ టాక్ .. సల్మాన్ స్టైల్ లోనే ఉందట..

Dabang

దబంగ్ సిరీస్‌లో భాగంగా సల్మాన్ ఖాన్ మరోసారి చుల్‌బుల్ పాండేగా ప్రేక్షకులు, ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 20 తేదీన ప్రపంచవ్యాప్తంగా రికార్డు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, సోహైల్ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ఏమనుకొంటున్నారంటే…

చుల్‌బుల్ పాండే ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్. దబాంగ్3 పూర్తిగా సల్మాన్ ఖాన్ స్టయిల్ సినిమా. మాస్, మసాలాలు వడ్డించడంలో ప్రభుదేవా సక్సెస్. ఇంటర్వల్ బ్లాక్, క్లైమాక్స్ ఫైట్ టెర్రిఫిక్. కిచ్చ సందీప్ ఎక్సలెంట్ అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. దబంగ్3 పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. తొలిభాగం ఫ్లాష్ బ్యాక్‌తో ముందుకు సాగుతుంది. అద్భుతమైన ఇంటర్వెల్‌తో సినిమా ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్‌లోనే రియల్ గేమ్ మొదలవుతుంది. ఆ తర్వాత సినిమా కథ మరో లెవెల్‌కు వెళ్తుంది. క్లైమాక్స్ సూపర్‌గా ఉంది అంటూ రాహుల్ వర్మ ట్వీట్ చేశారు.

కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు దబంగ్3 పెద్దగా సంతృప్తిని ఇవ్వదు. రొటీన్ స్టోరీ. ఇరిటేటింగ్ డైలాగ్స్. చైల్డీష్ యాక్షన్. ఊహించే విధంగా క్లైమాక్స్. ప్రభుదేవా డైరెక్షన్ చాలా వీక్. మాస్ ప్రేక్షకులకు, సల్మాన్ ఫ్యాన్స్‌కు నచ్చుతుంది అని శివ సత్యం అనే సమీక్షకుడు కామెంట్ చేశారు. నిర్మాత, సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ట్వీట్ చేస్తూ సల్మాన్ ఖాన్‌ ఫ్యాన్స్‌కు దబంగ్3 విందు భోజనం లాంటింది. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, డేంజరస్ విలన్ లాంటి సినిమాలో ఆకట్టుకొనే అంశాలు. సినిమా మిమ్మల్ని ఏ కోశాన నిరాశ పరచదు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

దబంగ్3 ఉత్సాహం, వినోదాన్ని అందించింది. సల్మాన్ ఖాన్‌ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ పడింది. సోనాక్షి గ్లామర్ పంట పండించింది. సయిమ్ మంజ్రేకర్ స్టన్నింగ్ ఉంది. అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది, ప్రభుదేవాకు కంగ్రాట్స్, దబంగ్3 సూపర్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది అని మనీష్ పాల్ ట్వీట్ చేశారు. దబంగ్3 ఉత్సాహం, వినోదాన్ని అందించింది. సల్మాన్ ఖాన్‌ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ పడింది. సోనాక్షి గ్లామర్ పంట పండించింది. సయిమ్ మంజ్రేకర్ స్టన్నింగ్ ఉంది. అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది, ప్రభుదేవాకు కంగ్రాట్స్, దబంగ్3 సూపర్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది అని మనీష్ పాల్ ట్వీట్ చేశారు.

నా కజిన్ దుబాయ్‌లో సినిమా చూశాడు. దంబంగ్ సిరీస్‌లో దబంగ్3 బెస్ట్ అని చెప్పాడు. సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో 300 కోట్ల సినిమాగా మారడం ఖాయం అని మరో నెటిజన్ ట్విట్‌లో పేర్కొన్నారు. దబంగ్3 చిత్రం సినిమా చూస్తే సల్మాన్ ఖాన్‌పై ఫ్యాన్స్‌కు ఎంత పిచ్చి ఉందో తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ కనిపించగానే విజిల్స్, అరుపులతో సినిమా దద్దరల్లింది. షర్ట్ విప్పేయగానే ఆ పిచ్చి పరాకాష్టకు చేరుకొన్నది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దుబాయ్‌, యూఏఈలో థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఫస్ట్ డే ఫస్ట్ అంటే ఇలా ఉంటుందనే విషయాన్ని రుజువు చేశాయి. ఊహించిన విధంగానే భాయ్‌జాన్ దుమ్మురేపాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Related posts