telugu navyamedia
సినిమా వార్తలు

పదవులకు లోబడే వ్యక్తిని కాదు..ఆవ‌న్నీ పుకార్లే..

రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని.. తాను పదవులకు లోబడే వ్యక్తిని కాదని, తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఒట్టి పుకార్లు అని మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా ఖండించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమై విందు భోజ‌నం చేసిన విష‌యం తెలిసిందే.

Acharya' star Chiranjeevi meets Andhra Chief Minister YS Jagan Mohan Reddy;  here's why | Telugu Movie News - Times of India

ఈ క్రమంలో తనకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ వస్తున్న వార్తలపై చిరంజీవి తీవ్రంగా ఖండిస్తూ.. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని, వాటిని కోరుకోనని తెలిపారు. పదవులు కోరుకోవడం తన అభిమతం కాదని..అలాంటి ఉద్దేశం లేదన్నారు.

తాను మళ్లీ రాజకీయాల్లోకి, చట్ట సభల్లోకి రావడం జరగదని స్పష్టం చేశారు. దయచేసి ఊహాగానాలను వార్తలుగా ప్రసారం చేయొద్దని కోరారు. ఈ వార్తలకు, చర్చలకు ఇప్పటితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం,థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులుముతున్నారు.

వైఎస్సార్‌సీపీ నాకు రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారమ‌ని ‘ అని మెగాస్టార్‌ చిరంజీవి తన ట్విటర్‌లో పేర్కొన్నారు.

Related posts