telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

స్టైలిష్ స్టార్ కార్వాన్ కు యాక్సిడెంట్…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కంబినేషన్లో ‘పుష్ప’ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప షూటింగ్ కోసం ఖమ్మంలో ఉన్న విషయ తెలిసిందే. అయితే అక్కడే కార్వాన్ కు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం బన్నీ పుష్ప షెడ్యూల్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఖమ్మం సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ సత్యనారాయణపురం వద్ద ఈ వ్యాన్ ను వెనుక నుండి ఓ లారీ ఢీ కొట్టింది. అయితే ప్రమాదం సమయంలో వాహనంలో అల్లు అర్జున్ లేడని చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ అప్పుడు కార్వాన్ లో సినిమా మేకప్ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పుష్ప’ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి కూడా భారీ అంచనాలున్నాయి. అయితే ఆగస్టు 13న పుష్ప సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అయితే సుకుమార్ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మికా మందన్న నటిస్తుండగా.. నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వరుస విజయాలు అందుకుంటున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Related posts