telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజారెడ్డి రాజ్యాంగం ఎక్కువకాలం నడవదు: దేవినేని ఉమ

devineni on power supply

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేత దేవినేని ఉమ స్పందించారు. కొల్లు రవీంద్రపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసు బనాయించి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో రాజారెడ్డి రాజ్యాంగం ఎక్కువకాలం నడవదని ఈ విషయాన్ని సీఎం జగన్ తెలుసుకోవాలని అన్నారు.

అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన బడుగు, బలహీన వర్గాల నేత కొల్లు రవీంద్రను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే హత్యకేసులో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఓ పథకం ప్రకారం ఇవన్నీ చేస్తున్నారని అన్నారు. కొల్లు రవీంద్రను జైల్లో పెట్టినా గానీ, ఆయన అగ్నిపునీతుడై ఈ కేసు నుంచి బయటికి వస్తాడని తెలిపారు. ఐదు రోజుల కిందట హత్య జరిగితే, కొల్లు రవీంద్ర పేరును ఆలస్యంగా ఎఫ్ఐఆర్ లో చేర్చి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.

Related posts