telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 తగ్గి రూ. 50,390 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 తగ్గి రూ. 46,190 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా రికార్డు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,070 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,060 పలుకుతోంది. అటు వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 300 తగ్గి రూ. 73,100 కి చేరింది.

Related posts