telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

మహిళలు గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం ధర

gold

మంగళవారం భారీగా పెరిగిన పసిడి ధరలకు మళ్ళీ బ్రేక్ పడింది. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ. 53,790 కు పలుకుతోంది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.780 తగ్గడంతో రూ. 50,950కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 తగ్గడంతో రూ.46,700 కు పలుకుతోంది. వెండి విషయానికి వస్తే…ఢిల్లీలో కిలో వెండి ధర 750 రూపాయలు తగ్గి రూ. 62000 కు చేరింది. నిన్న ట్రేడ్ లో కిలో వెండి ధర రూ. 62,750 వద్ద ముగిసింది. హైదరాబాద్ కిలో వెండి ధర రూ.750 తగ్గి రూ. 62,751 కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 0.20 శాతం పెరుగుదలతో 1919 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్ కు 0.50 పెరుగుదలతో 25.10 డాలర్లకు పెరిగింది. పండగ సమయంలో ఈ హెచ్చు తగ్గుళ్లు సాధారణమే అని నిపుణులు అంటున్నారు.

Related posts