బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమం ముగింపు దశకు వచ్చేసింది. సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ కార్యక్రమంలో 12వ వారం ఇంటి నుండి వరుణ్ సందేశ్ భార్య వితికా ఎలిమినేట్ అయ్యింది. గత వారం ఇక బిగ్‌బాస్ హౌస్‌లో బాబాభాస్కర్, వరుణ్ సందేశ్, వితిక, రాహుల్, అలీ రెజా, శివ జ్యోతి, శ్రీముఖి ఉండగా… 12వ వారం కోసం అందరూ ఎలిమినేషన్ లోకి వచ్చారు. దీంతో 12వ వారం వితికా ఎలిమినేట్ అయ్యింది. మరి వచ్చేవారం కోసం ఎవరెవరు నామినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. నాగార్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ ఒకరు ఉంటారని, కానీ ఆయన కన్పించకుండా ఏం చేయాలనేది అందరినీ ఆజ్ఞాపిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నాగార్జున తనకు కూడా ఒక బిగ్ బాస్ ఉన్నారని చెప్తున్నారు. ముందుగా బిగ్ బాస్ రియాలిటి షో ప్రసారమయ్యేటపుడు ఈ షోను విమర్శించాడు. అలా విమర్శించిన షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా నాగార్జున.. స్టార్ మా నిర్వహిస్తున్న స్టార్ మా అవార్ట్స్ 2019 అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ “బిగ్‌బాస్ షోలో అందరికీ నేను బాస్ అయితే.. నా జీవితంలో మాత్రం బిగ్‌బాస్ ఎప్పటికీ తన భార్య అమలే” అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అంతేకాదు ‘స్టార్ మా’ ప్రకటించిన ఈ అవార్డును తన సతీమణి అమల చేతుల మీదుగా అందుకున్నారు.
previous post
next post