telugu navyamedia
సినిమా వార్తలు

‘పంచమి’గా నిధి అగర్వాల్

టాలీవుడ్‌ లో ‘సవ్యసాచి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నిధి అగర్వాల్. ఆ తరువాత ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈబ్యూటీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాలోని ఆమె పాత్రను చిత్ర యూనిట్ పరిచయం చేశారు.

హిస్టారికల్ కథాంశంతో తెరకెక్కుతోన్న ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నిధి అగర్వాల్ ‘పంచమి’ అనే పాత్రలో కనిపించనుందని చిత్ర బృందం తెలియజేసారు. ఈ సందర్భంగా నిధి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. ఇందులో నిండైన చీరకట్టులో, ఒంటి నిండా నగలు సింగారించుకుని ఓ డ్యాన్స్ పోజ్ లో నిలబడి ఉంది. ‘పంచమి’ చంద్రుని వలె సొగసైనది మరియు రేడియెంట్ అని చిత్ర బృందం పేర్కొంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ వచ్చిన నిధి.. ఇందులో సాంప్రదాయకంగా కనిపిస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అర్జున్ రామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

‘హరి హర వీరమల్లు’ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. 45 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే తిరిగి సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని 2022 వేసవి లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Related posts