telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో చిన్నారి ప్రాణం కాపాడిన మహేష్

mahesh-babu

సూపర్ స్టార్ మహేష్ బాబు వల్ల ఇప్పుడు మరో చిన్నారి ప్రాణం ఊపిరి పోసుకుంది. తనుశ్రీ అనే చిన్నారికి హృదయ నాళంకు సంబంధించి ఆపరేషన్ చేయించడం ద్వారా మహేష్ మరో ప్రాణాన్ని కాపాడినట్టయ్యింది. దీనితో చాలా ఆనందంగా ఉందని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే ఇప్పటి వరకు వేలాది మంది పసి ప్రాయాలకు గుండె ఆపరేషన్లు చేయించి ప్రాణ దాతగా నిలిచి వారి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందానికి కారకులు అయ్యారు. ఇటీవలే ఓ ఇద్దరు పిల్లలకు ఆపరేషన్లు చేయించిన విషయం తెలిసిందే. మహేష్ దయాగుణానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే… పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్టు తమన్ తాజాగా వెల్లడించాడు.

Related posts