telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహిళలపై “శక్తిమాన్” నటుడి షాకింగ్ కామెంట్స్

MUkhesh-Khanna

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో ముఖేష్ ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో జరుగుతున్న మీటూ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలుచేయడం సంచలనంగా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మీటూ ఉద్యమానికి పూర్తి బాధ్యత వహించాల్సింది మహిళలే. వారు ఇళ్లు దాటి మగాళ్ల బుజాలు రాసుకుంటూ పని చేయడం ప్రారంభించారు. అప్పటి నుండే లైంగిక వేదింపులు మొదలు అయ్యాయి. ఆడవారు అంటే ఇంటి పట్టున ఉండి కుటుంబ బాధ్యత చూసుకోవాలి. అలా కాదని బయటకు వచ్చి ఇప్పుడు మీటూ అంటూ లైంగిక వేదింపుల ఆరోపణలు చేయడం ఏంటీ?” అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలను నెటిజన్స్, మహిళ సంఘాల వారు తప్పుబట్టడమే కాకుండా మహిళలోకంకు ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. మీటూ వల్ల ఎంతో మంది మహిళలు ధైర్యంగా ఉంటున్నారు. గతంలో మాదిరిగా లైంగిక వేధింపులు లేవు. అయితే ఒక సీనియర్ నటుడు మహిళలను తక్కువ చేసి మాట్లాడడం ఏమాత్రం సబబు కాదు. ఇక ముఖేష్ ఖన్నా అప్పట్లో శక్తిమాన్ గా నటించి పిల్లల పాలిట సూపర్ హీరో అయ్యాడు.

Related posts