దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. దుబ్బాకలో బిజెపి ఎన్నో ఎత్తుగడలు, కుట్రలు చేసిందని..మొదట డబ్బుల ప్రయోగం చేశారని మండిపడ్డారు. ఇప్పటికి చాలా సార్లు బిజెపి డబ్బులు పట్టుబడ్డాయని..బీజేపీ డబ్బుల డ్రామా ఫెయిల్ అయిందని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ వాళ్లపై దాడులు చేశారని డ్రామాలు చేశారని.. బిజెపి వాళ్ళ ఇండ్ల పై సోదాలు జరిగిన నాడే, టీఆర్‌ఎస్ వాళ్ళ ఇళ్లలో కూడా జరిగిందని వెల్లడించారు.దాడుల డ్రామా కూడా విఫలం అయిందని..బీజేపీ సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ.. ఇష్టారాజ్యంగా టీఆర్‌ఎస్ పై దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ఎల్లుండి ఎన్నిక ఉండగా, చివరి కుట్రకు పన్నాగం పన్నింది బిజెపి అని.. రేపు హైదరాబాద్ లో బిజెపి ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 2న లాఠీ ఛార్జి, లేదంటే ఫైరింగ్ జరిగేలా బిజెపి ప్లాన్ చేస్తోందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.
previous post