telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మా థియేటర్ లో .. నాకే టికెట్ దొరకలేదు.. : మహేష్ బాబు

even I donot get ticket in AMB said mahesh

‘మహర్షి’ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, తన ఏఎంబీ సినిమాస్ లో సినిమా టికెట్ ను పొందలేకున్నారట. ఈ మాటను ఆయనే అంటున్నారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఏఎంబీ సినిమాస్ లో ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమాను చూశారన్న సంగతి తెలిసిందే.

మహర్షి ప్రమోషన్ లో భాగంగా మహేశ్ బాబు, మీడియాతో మాట్లాడగా, జగన్ సినిమా చూశారన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. మీరు అవెంజర్స్ చూశారా? అన్న మీడియా ప్రశ్నకు, చాలా మంది సెలబ్రిటీలు ఏఎంబీకి వచ్చి సినిమాలు చూస్తున్నారని, తాను చూద్దామని టికెట్లు అడిగితే లేవని చెబుతున్నారని సరదాగా అన్నారు. రెండు రోజుల్లో ‘అవెంజర్స్’ సినిమా చూస్తానని చెప్పుకొచ్చారు.

Related posts