telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు…

అంబెడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని సవరించే కుట్ర జరుగుతున్నది. ఆ హక్కులు కాల రాసె ప్రయత్నం జరుగుతుంది అదే జరిగితే వందేళ్లు వెనక్కి పోతాం. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేట్ పరం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు తొలగించేందుకు ఓ మంత్రిత్వ శాఖ పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటుకు మంత్రిత్వ శాఖ అవసరం కానీ వాటిని తొలగించే షాఖ ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ సాధించింది అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎల్ఐసి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రయివేట్ పరం అయితే మన హక్కులు,రిజర్వేషన్లు ఉండవు. ఎస్సి, ఎస్టీ లకు అన్యాయం జరుగుతుంది. వారసత్వ సంపదగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి కానీ వాటిని బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తోంది. రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర జరుగుతున్నది. నీటిపారుదల శాఖలో జీవో నంబర్59 తెచ్చాను. అన్ని వర్కింగ్ ఏజెన్సీ లో జనాభా ప్రాతిపదికన  వర్క్ లు కేటాయించాలని తెచ్చాము. ఈ జీవో తెచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. సింగరేణి లో అమలు జరగడంలేదు అని పిర్యాదు వస్తే ఎస్సి, ఎస్టీ కమిషన్ వెళ్లి 21 శాతం వర్క్ ఇచ్చేలా అమలు చేసిన ఘనత మన తెలంగాణ రాష్ట్రంది. బీజేపీ రెచ్చగొట్టే ప్రకటనలకు మోసపోవద్దు. మాయమాటలు నమ్మద్దు అని తెలిపారు.

Related posts