సాంకేతిక పనుల నేపథ్యంలో వివిధ మార్గాల్లో జరుగుతున్న పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్టు సీపీఆర్‌ఓ రాకేష్ తెలిపారు. (47115 నంబర్) హైదరాబాద్-లింగంపల్లి ఎంఎంటీఎస్, (47135 నంబర్) లింగంపల్లి-హైదరాబాద్, (47111 నంబర్) హైదరాబాద్-లింగంపల్లి సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు.
(47209 నంబర్) హైదరాబాద్-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ సర్వీసును సికింద్రాబా ద్-ఫలక్‌నుమా స్టేషన్ల నడుమ తాత్కాలికంగా రద్దు చేశారు. (47199 నంబర్) ఫలక్‌నుమా-హైదరాబాద్ ఎంఎంటీఎస్ సర్వీ్‌సను ఫలక్‌నుమా-సికింద్రాబాద్ స్టేషన్ల నడుమ రద్దు చేశారు. (47200 నంబర్) ఫలక్‌నుమా-హైదరాబాద్ ఎంఎంటీఎస్ సర్వీసును లింగంపల్లి స్టేషన్ మీదుగా దారి మళ్లించి హైదరాబాద్‌కు నడిపించారు.