telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్ర‌త్య‌ర్థులు రిగ్గింగ్‌కు పాల్ప‌డే అవ‌కాశాలు: ట‌్రంప్‌

trump usa

మరో మూడు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రిప‌బ్లిక‌న్, డెమోక్రటిక్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఉత్తర క‌రోలినాలో జ‌రిగిన రిపబ్లికన్ పార్టీ స‌మావేశంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ… అధ్యక్షఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థులు రిగ్గింగ్‌కు పాల్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయని అన్నారు.

దేశ ప్రజలను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు కరోనాను కార‌ణంగా చూపెడుతూ ప్రత్యర్థి పార్టీల నేతలు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో మెయిల్ బ్యాలెట్ విధానం సరికాదని, మోసాలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయని అన్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని ఎన్నిక‌ల్లో గెలుపొందే ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే ప్రస్తుతం రిగ్గింగ్ ఒక్క‌టే వారికి మార్గంగా కనపడుతోందని ట్రంప్ పేర్కొన్నారు.

Related posts