telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పట్టాభికి ఏమైనా అయితే డీజీపీ, జ‌గ‌న్‌దే బాధ్య‌త‌..

టీడీపీ నేత పట్టాభికి ఏం జరిగినా డీజీపీ గౌతమ్‌ సవాంగ్, సీఎం వైఎస్‌ జగన్‌దే తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేత పట్టాభి రామ్ ని అరెస్ట్ ను ఖండించారు. ప్రజల్ని రక్షించే పోలీసులైతే పట్టాభిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి కానీ, దాడికి గురైన పట్టాభినే అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.

ఈ అరెస్ట్‌ గమనిస్తే.. వీరు ప్రజల కోసం పని చేసే పోలీసులు కాదని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు, ప్రతిపక్ష నేతలకీ రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేసిన నారా లోకేష్‌.. ప‌ట్టాభికి హానిత‌ల‌పెట్టాల‌ని పోలీసులు చూస్తున్నారని.. ఆయనకు ఏమైనా జ‌రిగితే డీజీపీ, సీఎందే బాధ్యత అన్నారు.. త‌క్షణ‌మే ప‌ట్టాభిని కోర్టు ముందు హాజరుపర్చాలని డిమాండ్‌ చేశారు..

‘బోసిడీకే’ అనేది రాజద్రోహం అయితే.. వైసీపీ నేతల అసభ్య భాష ఏ ద్రోహం కిందకు వస్తుందో డీజీపీ సమాధానం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ గుట్టురట్టు చేస్తున్నారనే ఉద్దేశ్యంతోనే పట్టాభి రామ్‌ ని అదుపులోకి తీసుకున్నారని, ఈ విషయం ప్రజలకు కూడా తెలిసిపోయిందని లోకేష్ పేర్కొన్నారు.

జగన్‌రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి వ్యాపారంలా మారిపోయిం ది. ఉద్యోగాలివ్వలేక గంజాయిని వ్యాపారంలా మార్చేశారు. తుని, అరకు, నర్సీపట్నం, తదితర ప్రాంతాల నుంచి తెలంగాణకు గంజాయి వస్తోందని హైదరాబా ద్‌ సీపీ అంజనీకుమార్‌ చెప్పారు. ఈ రోజే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గంజాయిపై ఉద్యమం చేయాలని, పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని అన్నారు. కానీ ఇక్కడ సైకో జగన్‌కు చీమకుట్టినట్లు కూడా లేదు’’ అని లోకేశ్‌ విమర్శించారు.

ఎన్ని దాడులు చేసినా.. ఎంతమందిని అరెస్ట్ చేసినా.. దేశానికే ముప్పుగా పరిణమించిన వైసీపీ డ్రగ్స్ మాఫియా ఆట కట్టించే వరకు టీడీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

కాగా..బుధవారం నాడు టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి రాత్రి పది గంట‌ల‌కు తోట్లవల్లూరు తరలించారు పోలీసులు. భారీ భద్రత మధ్య తోట్లవల్లూరు పీఎస్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు, ప్రతిపక్ష నేతలకు రక్షణ లేకుండా పోతోందని వాపోయారు.

Related posts