telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తిరుమ‌ల ప్రత్యేక, సర్వదర్శన టికెట్ల విడుదల తేదీ ఖ‌రారు..

క‌లియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త. వచ్చే నెల నవంబరు నుంచి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచనున్నట్లు ప్రకటించింది. సర్వదర్శనం 10వేలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 12వేలు జారీ చేయనున్నట్లు తెలిపింది. నవంబరు నెలకు ప్రత్యేక, సర్వదర్శన టికెట్ల విడుదల తేదీలను టీటీడీ ఖరారు చేసింది. ఈ నెల 22న అనగా రేపు ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శన టికెట్లు, 23న ఉదయం 10వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు తితిదే ప్రకటించింది. https://tirupatibalaji.ap.gov.in ద్వారా ఆన్లైన్లో టికెట్లు పొందవచ్చును.

అలాగే.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకువస్తేనే అనుమతి ఇవ్వనున్న‌టు్ల‌ టీటీడీ తెలిపింది

Related posts