నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేరరెడ్డి తీరుతో గత కొంత కాలంగా సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పార్టీలోని వ్యతిరేకులపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గతంలో కొంతమంది తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారని, కానీ జగన్ టికెట్ ఇవ్వడంతో తాను గెలిచానని, అలాంటి వారందరికీ అధికారంలోకి వచ్చాక తాను మంచే చేశానని అన్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అయితే తాజాగా మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యాలు హాట్ టాపిక్‌గా మారాయి.
మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మేకపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అన్న కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డికి బదులు తాను చనిపోయి ఉంటే బాగుండేదని సుబ్బారెడ్డి అనడం సరికాదన్నారు. పార్టీలో ఒక పెద్దాయనకు డబ్బులు ఇచ్చి ఇంచార్జి పదవి తెచ్చుకుంటానని ప్రచారం చేస్తున్నాడని ఆయన విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే పోటీ చేస్తానని.. లేకుంటే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్థిలో కూడా నా సోదరులు ఇంకా భాగాలు పెట్టి ఇవ్వలేదని, సుబ్బా రెడ్డి అంతు తేలుస్తానని బహిరంగంగా హెచ్చరించారు.
అమరావతికి మూడు వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ : బొత్స