telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్‌ : ఎస్ఈసీ నీలం సాహ్నీ

Neelam sahani

ఏపీలోని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్నీ ఇవాళ భేటీ అయ్యారు. అయితే.. ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్వహించిన సమావేశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరించాయి. అటు కాంగ్రెస్‌ పార్టీ మాత్రం భేటీకి హాజరై.. తమ నిరసనను తెలిపాయి. అయితే ఈ సమావేశం అనంతరం ఎస్ఈసీ నీలం సాహ్నీ మాట్లాడుతూ.. ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకున్నాక పరిషత్ ఎన్నికల నిర్వహణపై సమీక్షించామన్నారు. అంతా సమీక్షించిన తర్వాతే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చామని.. గతంలో ఆగిన ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచి ఎన్నికల నిర్వహణకు సన్నద్దంగా ఉన్నామని చెప్పిన మీదట నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని… ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగింది.. ఇంకా జాప్యం జరగడం మంచిది కాదని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని… గతంలో ఏర్పాటు చేసిన నోడల్ ఆఫీసర్ వ్యవస్థే ఇప్పుడూ పని చేస్తోందన్నారు. ఏమైనా ఫిర్యాదులు వస్తే స్వీకరిస్తామని.. చాలా కాలంగా స్థానిక ఎన్నికలు పెండింగులో ఉన్నాయని తెలిపారు. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉందని ఆమె వెల్లడించారు.

Related posts