telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్రిష్ చిత్రానికి పవన్ డేట్స్ ఇచ్చేది అప్పుడేనా ?

Pawan

పవర్ ‌స్టార్ పవన్ ‌కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన డైరెక్టర్ క్రిష్‌తో తెరకెక్కే భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్‌ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ జోనర్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎక్కువగానే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వకీల్ సాబ్ షూట్ కు రెడీ అవుతుండగా క్రిష్ తో సినిమాకు కూడా రెడీ అన్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. వచ్చే డిసెంబర్ లో పవన్ డేట్స్ ను ఇవ్వనున్నట్టు బజ్ వినిపిస్తుంది. మరి పవన్ ఎప్పుడు మొదలు పెట్టనున్నారో చూడాలి. ఇక ఇప్పుడు దాదాపు ఐదు సినిమాలు పవన్ చేతిలో ఉన్నాయి. వాటిలో దర్శకుడు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న “వకీల్ సాబ్” దాదాపు పూర్తి కానుండగా తర్వాత క్రిష్, ఆ తర్వాత తన హిట్ డైరెక్టర్ హరీష్ శంకర్ లతో సినిమాలు రెడీగా ఉన్నాయి. అయితే వీటన్నిటిలో మాత్రం మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది క్రిష్ తో ప్లాన్ చేస్తున్న పీరియాడిక్ చిత్రమే అని చెప్పాలి.

Related posts